: దీపావళి నాటికి 12 లక్షల రేషన్ కార్డుల పంపిణీ: మంత్రి ప్రత్తిపాటి


రానున్న దీపావళి పండుగ నాటికి రాష్ట్రంలో 12 లక్షల రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. టీడీపీ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. రైతు రుణమాఫీని వ్యతిరేకించిన వైకాపా అధినేత జగన్ కు రైతుల గురించే మాట్లాడే హక్కు ఎక్కడుందని ఎద్దేవా చేశారు. నరసరావుపేట మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ గా రమేష్ బాబు, వైస్ ఛైర్మన్ గా మల్లికార్జున్ రావు ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు ప్రత్తిపాటి, అచ్చెన్నాయుడు, టీటీడీ ఛైర్మన్ చదలవాడ, ఎంపీ రాయపాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ, రాజధాని నిర్మాణలో ఐదు కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News