: కోర్టుకు వచ్చిన అగ్రిగోల్డ్ చైర్మన్... మరో ఇద్దరు డైరెక్టర్లు కూడా!


రెండు తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, తమిళనాడులకు చెందిన లక్షలాది మంది మధ్యతరగతి జనాన్ని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ చైర్మన్ వీఆర్ రావ్ అవ్వాస్ కొద్దిసేపటి క్రితం హైకోర్టుకు వచ్చారు. తక్కువ కాలంలోనే రెట్టింపు రాబడులు ఇస్తామని నమ్మబలికిన అగ్రిగోల్డ్ నిర్వాహకులు వేలాది కోట్ల రూపాయలను సేకరించారు. మెచ్యూరిటీ తీరిన బాండ్ల డబ్బులు చెల్లించడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో వందలాది మంది పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కార్యాలయాన్ని మూసేసిన అగ్రిగోల్డ్ చైర్మన్ వీఆర్ రావ్ అవ్వాస్ తాపీగా ఇంటిలో కూర్చున్నారు. అయితే తదుపరి జరిగే ప్రతి విచారణకు ఆయన హాజరుకావాల్సిందేనని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రావ్ అవ్వాస్ నేటి ఉదయం ప్రారంభమైన విచారణకు స్వయంగా హాజరయ్యారు. సంస్థకు చెందిన మరో ఇద్దరు డైరెక్టర్లు కూడా కోర్టుకు వచ్చారు.

  • Loading...

More Telugu News