: బెలూచిస్థాన్ లో పాక్ సైన్యం మారణహోమం... వందమంది చిన్నారుల ఊచకోత


ఓ వైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో దారుణాలకు ఒడిగడుతున్న పాక్ సైన్యం... మరో వైపు బెలూచిస్థాన్ లో కూడా అరాచకాలకు పాల్పడుతోంది. ఒకేసారి వంద మంది చిన్నారుల మృతదేహాలు బయటపడటంతో బెలూచిస్థాన్ ప్రజలు షాక్ కు గురయ్యారు. మరో దారుణం ఏమిటంటే, ఈ చిన్నారులందరి తలలోకి బుల్లెట్లను దింపి హతమార్చారు. దీంతో బెలూచ్ లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ నుంచి తమకు స్వాతంత్ర్యం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ, ఉద్యమాలు తీవ్రతరం అవుతున్నాయి. పక్కనున్న పాకిస్థాన్ మ్యాప్ లో ఎరుపు రంగులో ఉన్న ప్రాంతమే బెలూచిస్థాన్. 1947లో దేశ విభజన జరిగినప్పుడు బెలూచిస్థాన్ స్వతంత్ర రాజ్యంగానే ఉండేదన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. 1948 ఏప్రిల్ వరకు బెలూచ్ స్వత్రంత్ర రాజ్యంగానే ఉండేది. అయితే, ఆ రాజ్యాన్ని అప్పుడే పురుడు పోసుకున్న పాకిస్థాన్ ఆక్రమించుకుంది. అప్పటి నుంచి బెలూచిస్థాన్ లో స్వాతంత్ర్యం కోసం ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఈ ఆందోళనలను పాక్ సైన్యం ఉక్కుపాదంతో అణచి వేస్తూనే ఉంది. పాక్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే... వారిని, వారి కుటుంబీకులను గుట్టు చప్పుడు కాకుండా, మూడో కంటికి తెలికుండా పాక్ సైన్యం అత్యంత దారుణంగా హతమారుస్తోంది. ఈ క్రమంలోనే వంద మంది చిన్నారులను పాక్ సైన్యం కాల్చి చంపింది. ఈ దారుణం వెలుగు చూడటంతో, బెలూచ్ ప్రజల్లో ఆగ్రహావేశాలు తీవ్ర రూపం దాల్చాయి. మీ రాక్షస పాలన మాకు వద్దంటూ, బెలూచ్ ప్రజలు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలను తీవ్రతరం చేశారు. మరోవైపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కూడా పాకిస్థాన్ సైన్యం చేస్తున్న దురాగతాలకు అంతే లేకుండా పోతోంది. దీంతో, ఆ ప్రాంత ప్రజలు కూడా తమను భారతదేశంలో కలిపివేయాలంటూ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ ను వేరు చేసిన విధంగానే, తమను కూడా స్వతంత్రులను చేస్తుందని భారత్ పై ఈ రెండు ప్రాంతాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

  • Loading...

More Telugu News