: మామా అల్లుళ్లు కలసి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు: రేవంత్ రెడ్డి
రైతు సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను ప్రభుత్వం అణగదొక్కటం అన్యాయమని టి.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సభలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సభ్యులను మొత్తం సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం దారుణమైన చర్య అని ఖండించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రేవంత్ మాట్లాడుతూ, రైతులను ఆదుకోమంటే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. మామా అల్లుళ్లు కలసి సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. అందరితో చర్చించాక అవసరమైతే రేపు తెలంగాణ బంద్ చేస్తామని తెలిపారు.