: సభలో లేకుండా తప్పించుకున్న ఎర్రబెల్లి... సస్పెండ్ కాకున్నా బయటకొచ్చిన జానారెడ్డి
విపక్షాల డిమాండ్లపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. రైతు రుణమాఫీపై సింగిల్ సెటిల్ మెంట్ కోసం ప్రభుత్వంపైకి దండెత్తిన విపక్షాల సభ్యులనందరినీ ప్రభుత్వం సస్పెండ్ చేసేసింది. అయితే ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు నేటి సమావేశాలకు హాజరుకాలేదు. తద్వారా ఆయన సస్పెన్షన్ వేటు నుంచి తప్పించుకున్నారు. మరోవైపు సభకు హాజరవడమే కాక విపక్షాలనన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చిన సీఎల్పీ నేత జానారెడ్డిపై మాత్రం సస్పెన్షన్ వేటు పడలేదు. జానారెడ్డిపై ఆది నుంచి కొంతమేర సాఫ్ట్ కార్నర్ తో వెళుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ సభ్యులనందరినీ సస్పెండ్ చేసినా, జానారెడ్డి పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఇక తన పార్టీ సభ్యులంతా సస్పెండ్ కావడంతో వారికందరికీ సభలో నాయకుడిగా ఉన్న జానారెడ్డి తనకు తానుగా సభ నుంచి బయటకు వచ్చేశారు.