: సభ్యులందరినీ సస్పెండ్ చేయడం దారుణం: ఎల్.రమణ
తెలంగాణ శాసనసభలో విపక్ష సభ్యులందరిని ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మండిపడ్డారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని అడిగినందుకు శాసనసభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ఇందుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మల్ని దగ్ధం చేస్తామని చెప్పారు. కార్యకర్తలు, నేతలు రైతులకు అండగా నిలబడాలని రమణ కోరారు.