: శాసనసభ నుంచి 28 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్... మొత్తం సమావేశాలకు సస్పెన్షన్ వర్తింపు


తెలంగాణ శాసనసభలో రైతు రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులంతా ఏకతాటిమీదకు వచ్చి, సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. స్పీకర్ మధుసూదనాచారి సర్ది చెప్పేందుకు ఎంతో ప్రయత్నించినా విపక్షాలు వినలేదు. దీంతో, శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు సభాకార్యక్రమాలను అడ్డుకుంటున్న ఈ సభ్యులను సభనుంచి సస్పెండ్ చేయాలని కోరారు. దీంతో, స్పీకర్ వీరందరిని ఈ సెషన్ లో మిగిలిన రోజుల సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్ చేశారు. శాసనసభ నుంచి సస్పెండ్ అయిన వారు... కాంగ్రెస్ పార్టీ.... పువ్వాడ అజయ్, డీకే అరుణ, భాస్కర్ రావు, మల్లు భట్టివిక్రమార్క, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి, పద్మావతి రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సంపత్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి. టీడీపీ... ఆరికెపూడి గాంధీ, గోపీనాథ్, ప్రకాశ్ గౌడ్, రాజేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సాయన్న, వివేకానంద. బీజేపీ... కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి. వైకాపా... పాయం వెంకటేశ్వర్లు. సీపీఎం... సున్నం రాజయ్య. సీపీఐ... రవీంద్ర కుమార్. ఇండిపెండెంట్... దొంతి మాధవరెడ్డి.

  • Loading...

More Telugu News