: మోదీకి శిక్ష పడాల్సిందే: రాంజెఠ్మలానీ
భారత ప్రజలను మోసం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి తప్పనిసరిగా శిక్ష పడాల్సిందేనని ప్రముఖ న్యాయవాది, మాజీ రాజ్యసభ సభ్యుడు రాంజెఠ్మలానీ వ్యాఖ్యానించారు. మోదీ ఓటమిని తాను కోరుకుంటున్నానని ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. కాగా, జూన్ వరకూ మోదీ కోటరీలోనే ఉన్న రాంజెఠ్మలానీ, తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా మోదీ ఉండాలని గట్టిగా పట్టుబట్టారు కూడా. చీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా కేవీ చౌదరిని నియమించిన తరువాత ఆయన బీజేపీకి దూరం జరిగారు.