: టీఎస్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం... ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్


కొద్ది రోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. వెంటనే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే, రైతు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీనికి సమాధానంగా, రెండు రోజుల పాటు రైతు సమస్యలు, ఆత్మహత్యలపై సమగ్రమైన చర్చ జరిగిందని... దీనిపై ఇంకా చర్చించాల్సింది ఏమీ లేదని స్పీకర్ చెప్పారు. సభాగౌరవాన్ని కాపాడాలని, సభా కార్యక్రమాలు కొనసాగేలా చూడాలని విపక్ష సభ్యులకు స్పీకర్ సూచించారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

  • Loading...

More Telugu News