: పాతబస్తీ ‘వలీమా’లో ఘర్షణ... అల్లుడిని నరికేసిన మేనమామ


హైదరాబాదులోని పాతబస్తీ ‘హత్యల బస్తీ’గా మారుతోంది. ప్రతి చిన్న విషయానికి ఘర్షణకు దిగుతున్న అక్కడి వ్యక్తులు రక్తపాతానికి తెగబడుతున్నారు. మొన్నటికి మొన్న చిన్న జట్కా బండి కోసం ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన కత్తి ఫైటింగ్ లో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. తాజాగా నిన్న అదే ప్రాంతంలో నెలకొన్న చిన్న వివాదం మరో వ్యక్తి హత్యకు దారి తీసింది. వివరాల్లోకెళితే... పాతబస్తీ పరిధిలోని భవానీ నగర్ కు చెందిన హైదయత్ ఫంక్షన్ హాల్ లో నిన్న ఓ వివాహ విందు (వలీమా) జరిగింది. విందులో భాగంగా అహ్మద్ అనే యువకుడిపై అతడి మేనమామ కత్తితో దాడి చేశాడు. తన భార్యకు సంబంధించి నగల విషయంలో అల్లుడితో గొడవపడ్డ నిందితుడు ఒక్కసారిగా ఆగ్రహావేశంతో ఊగిపోయాడు. కత్తి తీసి అల్లుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో అహ్మద్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అతడు చనిపోయాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. అప్పటిదాకా వేడుకగా జరుగుతున్న వలీమా ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదాన్ని నింపుకుంది.

  • Loading...

More Telugu News