: 30 ఏళ్లుగా పక్కలో 'బాంబు'!


దాదాపు మూడు దశాబ్దాలుగా పేలకుండా పడివున్న బాంబును ఫ్లవర్ వాజ్ గా భావించి, దానిలో నిత్యమూ పూలను అలంకరిస్తూ వచ్చిన మహిళ, ఇప్పుడు విషయం తెలుసుకుని అవాక్కయింది. ప్రస్తుతం 45 సంవత్సరాల వయసున్న బ్రిటన్ మహిళ క్యాథరిన్ రాలిన్స్, తన 15 ఏళ్ల వయసులో ఇంటి బయట ఆడుకుంటుండగా, మొదటి ప్రపంచయుద్ధంలో వాడిన ఓ పేలని బాంబు ఆమెకు దొరికింది. పొడుగ్గా, అందంగా, నగిషీలతో ఉండటంతో, దాన్ని ఇంటికి తీసుకెళ్లి, దానిలో పూలను పెడుతూ, అందంగా అలంకరించి ఆనందిస్తూ ఉండేది. ఇటీవల ఓ డాక్యుమెంటరీని చూస్తుండగా, జర్మనీ సేనలు విడిచిన కొన్ని బాంబులు పేలలేదని చూపుతూ, ఆ తరహా బాంబుల చిత్రాలను చూపారు. దాన్ని చూసిన తరువాత క్యాథరిన్ విషయం గమనించింది. విషయాన్ని పోలీసులకు తెలిపింది. "ఈ బాంబు పేలితే చుట్టుపక్కల 20 మీటర్ల దూరం వరకూ సర్వనాశనమవుతుంది. ఈ ఇంటిని నేలమట్టం చేసేంత శక్తి ఉంది" అని పోలీసులు వివరించినట్టు తెలిపింది. బాంబ్ నిర్వీర్య నిపుణులు వచ్చి, అందులోని పేలుడు పదార్థాన్ని తొలగించి తిరిగి తనకే ఆ షెల్ ను ఇచ్చారని, దాన్నిప్పుడు మళ్లీ పూలకుండీగా వాడుకుంటున్నానని ఆనందంగా చెబుతోంది కేథరిన్. 30 ఏళ్లుగా బాంబును పక్కనే పెట్టుకుని నివసించానన్న ఆలోచన ఎప్పుడు వచ్చినా గుండె వేగం పెరుగుతోందని ఆమె చెబుతోంది.

  • Loading...

More Telugu News