: బీహార్ ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్ దూకుడు... మోదీపై మాటల తూటాలు


మజ్లిస్ (ఎంఐఎం) నేత అక్బరుద్దీన్ ఒవైసీ నిన్న బీహార్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయారు. బీహార్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తొలిసారిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అక్కడి పలు ప్రాంతాల్లో పర్యటించారు. తాజాగా నిన్న బీహార్ వెళ్లిన అక్బరుద్దీన్ కిషన్ గంజ్ జిల్లాలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీపై మాటల తూటాలు పేల్చారు. కాంగ్రెస్ అసమర్థత వల్లే నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని కాగలిగారని ఆయన ఆరోపించారు. 2002 నాటి గుజరాత్ అల్లర్లకు సంబంధించి మోదీపై కాంగ్రెస్ ఉక్కుపాదం మోపి ఉంటే, బలమైన సాక్ష్యాలతో కేసు నమోదు చేసి ఉంటే నేడు మోదీ ప్రధాని కాగలిగేవారే కాదని ఆయన విరుచుకుపడ్డారు. గద్దెనెక్కిన నాటి నుంచి విదేశీ పర్యటనల్లో మునిగితేలుతున్న నరేంద్ర మోదీ ఓ ప్రవాస భారత ప్రధాని అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News