: ఉరిశిక్ష ఉండాల్సిందే... లా కమిషన్ సిఫార్సులకు హోం తిరస్కరణ!
ఇండియాలో ఉరిశిక్షను రద్దు చేయాలని న్యాయ కమిషన్ చేసిన సిఫార్సులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తిరస్కరించనున్నట్టు తెలుస్తోంది. దేశానికి ఉగ్రవాదం నుంచి ముప్పు పొంచివున్న నేపథ్యంలో మరణదండనను పూర్తిగా రద్దు చేసే సమయం ఇంకా రాలేదని మోదీ సర్కారు భావిస్తున్న నేపథ్యంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఉగ్రవాద కేసులు మినహా మిగతా కేసుల్లో ఉరిశిక్షను రద్దు చేయాలని లా కమిషన్ నివేదిక సమర్పించగా, ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంలో మరో వారం రోజుల్లో తుది నిర్ణయం అధికారికంగా వెలువడుతుందని తెలుస్తోంది. మరణశిక్ష రద్దు సిఫార్సును తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తమ సిఫార్సుల నివేదికను న్యాయ కమిషన్ సుప్రీంకోర్టుకు కూడా అందజేసింది.