: జీన్స్ ప్యాంట్ లో వచ్చిన సీతయ్య... వేదికపై బావ చంద్రబాబుతో మాటామంతి


నందమూరి హరికృష్ణ ఏం చేసినా, కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న ఆయన అప్పుడెప్పుడో పార్టీ వేదికపైనే అసంతృప్తి వెళ్లగక్కి విసురుగా లేచి వెళ్లిపోయారు. తనను అనునయించేందుకు పార్టీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు యత్నించినా ససేమిరా వినలేదు. తాజాగా నిన్న హైదరాబాదులో జరిగిన పార్టీ జాతీయ, తెలుగు రాష్ట్రాల కొత్త కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా హరికృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పార్టీ నేతలంతా మామూలు ప్యాంట్లలో వస్తే, హరికృష్ణ మాత్రం జీన్స్ ప్యాంట్ లో వచ్చారు. ముందు వరుసలోనే కూర్చున్న ఆయన కార్యక్రమంలో భాగంగా పార్టీ అధినేత, తన బావ నారా చంద్రబాబునాయుడితో మాట కలిపారు. ఏదో విషయాన్ని ఆయన చంద్రబాబు చెవిలో చెప్పారు. హరికృష్ణ చెప్పిన అంశాలను చంద్రబాబు కూడా సాంతం ఆలకించారు ఈ దృశ్యాన్ని పార్టీ నేతలు ఆసక్తికరంగా గమనించారు.

  • Loading...

More Telugu News