: మోదీ దైవదూత అని మోసపోయా...మీరు బుద్ధి చెప్పండి: బీహారీలకు రాంజెఠ్మలానీ పిలుపు


ప్రముఖ న్యాయవాది, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి రాంజెఠ్మలానీ నిన్న ప్రధాని నరేంద్ర మోదీపై అంతెత్తున ఎగిరిపడ్డారు. అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తానని ప్రకటించిన మోదీని తాను దైవదూతగానే భావించానని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తనను మోదీ మోసం చేశారని జెఠ్మలానీ వ్యాఖ్యానించారు. అయితే మీరు మాత్రం మోసపోవద్దని ఆయన బీహార్ ప్రజలకు సూచించారు. బీహార్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ ప్రత్యర్థులకు ఓటేయాలని ఆయన ఆ రాష్ట్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. నల్లధనాన్ని వెనక్కి తెప్పించడంలో ఇటు ఎన్టీఏ ప్రభుత్వమే కాక, గత యూపీఏ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో పాటు మాజీ మంత్రి చిదంబరంను అరెస్ట్ చేస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని జెఠ్మలానీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News