: తెలంగాణలో ‘సాగు’ మెరుగవుతోందట... ఓవరాల్ గా ‘ఏ ప్లస్’ రేటింగ్ ఇచ్చిన ఇక్రా


కొత్త రాష్ట్రం తెలంగాణలో కలిసి రాని సాగు అన్నదాతల ఊపిరి తీస్తోంది. రాష్ట్రంలో రోజూ ఎక్కడో ఒక చోట రైతుల బలవన్మరణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ విషయంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. అయితే, రెండేళ్ల పాటు నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కుదేలైన సాగు రంగం క్రమంగా పుంజుకుంటోందట. రాష్ట్రంలో వ్యవసాయ రంగం క్రమంగా మెరుగవుతోందని ఇక్రా (ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్‌మేషన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ తెలంగాణకు ఓవరాల్ గా ‘ఏ ప్లస్’ రేటింగ్ ను ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రాష్ట్రానికి ఇక్రా ‘ఏ మైనస్’ రేటింగ్ ను ఇచ్చింది. తాజాగా తెలంగాణకు ఆ సంస్థ ‘ఏ’ గ్రేడ్ ఇచ్చింది. ఇక్రా రేటింగ్ తో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయని నిన్న తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

  • Loading...

More Telugu News