: నేడు హస్తినకు చంద్రబాబు... సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. మరికాసేపట్లో హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన నేటి సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. భేటీలో భాగంగా ఆయన ప్రధానితో పలు కీలక అంశాలపై చర్చ జరిపే అవకాశాలున్నట్లు సమాచారం. స్వచ్ఛ భారత్ అభియాన్ కు సంబంధించి ఏర్పాటైన నీతి ఆయోగ్ సబ్ కమిటీకి చంద్రబాబు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదికను కూడా చంద్రబాబు ప్రధానికి అందజేయనున్నారు.