: ఖమ్మంలో విస్తృత తనిఖీలు


హైదరాబాద్ లో గొలుసు దొంగతనాలు, వరుస చోరీలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా పోలీసులు అప్రత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఖమ్మం బస్టాండ్, రైల్వే స్టేషన్ లలో తనిఖీలు చేపట్టారు. అనుమానితుల లగేజీని పరిశీలించారు. డీఎస్పీ దక్షిణామూర్తి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే వారిని వదిలిపెడుతున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News