: బీహార్ ఎన్నికలకు పంజాబ్ లో ప్రచారం!


త్వరలో బీహార్ లో ఎన్నికలు జరగనుంటే... నాయకులు మాత్రం పంజాబ్ లో ప్రచారం చేస్తున్నారు. విడ్డూరంగా ఉందనుకుంటున్నారా? అదేం కాదులెండి.. ఎందుకంటే, బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రజలు చాలామంది పంజాబ్ రాష్ట్రంలో పనులు చేస్తూ అక్కడే ఉండిపోయారట. పంజాబ్ లో సుమారు 20 లక్షల మంది బిహారీలు ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమయానికి వారందరిని బీహార్ కు తరలించే పనుల్లో ఆయా పార్టీలు నిమగ్నమయ్యాయి. అందుకని, వారిని ఓట్లు అడిగేందుకు అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బీహార్ నాయకులు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులైతే పంజాబ్ లో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. పంజాబ్ లో 'చలో బీహార్ అభియాన్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. జేడీ(యు), కాంగ్రెస్ పార్టీలు కూడా బాగానే ప్రచారం సాగిస్తున్నాయి.

  • Loading...

More Telugu News