: జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్


హైదరాబాద్ లో గొలుసు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బైక్ లపై తిరుగుతూ మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులు లాక్కెళుతున్న సంఘటనలు పోలీసులకు కంటివీుద కునుకు లేకుండా చేస్తున్నాయి. కూకట్ పల్లి, ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట్, ఫిల్మ్ నగర్, ఉప్పల్ మొదలైన ప్రాంతాల్లో ఇటీవల జరిగిన గొలుసు దొంగతనాల నేపథ్యంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అనుమానమొచ్చిన బైక్ లను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, బీహార్ రిజిస్ట్రేషన్లతో ఉన్న పల్సర్ బైక్ లపై పోలీసులు ప్రత్యేక దృష్టి కేటాయించారు. అనుమానంగా ఉన్న బైక్ లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేసిన తర్వాత ఆ వాహనాలను అప్పగిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News