: చంద్రబాబుకు గుడి కడతాం: హరిశ్చంద్రపురం రైతులు
ఆంధ్రప్రదేశ్ రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి గుడి కట్టనున్నారు. ఈ విషయాన్ని అమరావతికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిశ్చంద్రపురం గ్రామ రైతులు తెలిపారు. తమ గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలోకి తీసుకువచ్చినందుకుగాను చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతగా ఆయనకు గుడి కడుతున్నామని ఆ గ్రామ రైతులు పేర్కొన్నారు. కృష్ణానది ఒడ్డున ఈ గుడి నిర్మాణం జరగనుందని, 15-20 అడుగుల చంద్రబాబు విగ్రహంను ప్రతిష్ఠించదలచుకున్నామని అన్నారు. న్యూయార్క్ లో ఉన్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో బాబు విగ్రహాన్ని రూపొందించనున్నట్లు రైతులు వివరించారు. బాబు గుడి కోసం సుమారు రూ.1 కోటి ఖర్చుచేయనున్నట్లు సమాచారం.