: జానారెడ్డి జానెడంత మంచి కూడా చెప్పలేదు: మంత్రి కేటీఆర్ విమర్శ


రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని మంత్రి కె.తారకరామారావు హామీ ఇచ్చారు. మెదక్ జిల్లాలోని కల్హేర్ లో ఆదివారం స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇటీవల శాసనసభలో రైతు సమస్యలు, ఆత్మహత్యలపై జరిగిన చర్చ తాము ఆశించిన దానికి భిన్నంగా జరిగిందన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేయలేదని అన్నారు. ప్రతిపక్షనేత జానారెడ్డి జానెడంత మంచి కూడా చెప్పలేదని విమర్శించారు. రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

  • Loading...

More Telugu News