: టీటీడీపీ సీనియర్ నేతల అసంతృప్తి
తెలుగుదేశం పార్టీ ప్రకటించిన కమిటీల్లో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆదివారం జరిగిన కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్దిరెడ్డి, కృష్ణయాదవ్ హాజరుకాలేదు. వారికి సరైన పదవులు ఇవ్వని కారణంగానే వారు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కష్టపడిన వారికి సరైన ప్రాధాన్యమివ్వడం లేదంటూ వారు వాపోయినట్లు సమాచారం. ఈ ముగ్గురే కాకుండా, పార్టీకి చెందిన మరో సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు కూడా గైర్హాజరయ్యారు. ఈ విషయమై మండవ మాట్లాడుతూ, పార్టీలో తాను క్రియాశీలకంగా లేనని, అందుకే రాలేదని అన్నారు.