: స్థానికులకే ఉద్యోగాలిచ్చామని నిరూపిస్తే ఉద్యమం విరమిస్తా!: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
జిందాల్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలిచ్చారని కనుక నిరూపిస్తే తన ఉద్యమాన్ని విరమించుకుంటానని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమపై ప్రభుత్వం దొంగ ప్రేమ చూపిస్తోందన్నారు. కర్నూల్ జిల్లా లోని గడివేములలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఇస్మాయిల్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బాధిత రైతు కుటుంబానికి రూ.5 వేలు, యాభై కిలోల బియ్యం అందజేశారు. శ్రీశైలం రిజర్వాయర్ లో 854 అడుగుల నీటిమట్టం ఉండేలా చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని బైరెడ్డి కోరారు.