: నా కొడుకు ఐఎస్ లో చేరాడు... మరణించాడు: జోర్డాన్ ఎంపీ దలాయిన్
ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్న 23 ఏళ్ల తమ కొడుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరి, మరణించాడంటూ జోర్డాన్ ఎంపీ మాజెన్ దలాయిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాక్ లో ఒక ఆత్మాహుతి దాడికి కూడా పాల్పడ్డాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఇరాకీ ఆర్మీ పోస్టుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో చనిపోయిన ముగ్గురు ఫొటోలను ఐఎస్ వెబ్ సైట్ లో పెట్టిందని, అందులో తమ కుమారుడు ఉన్నట్లు మాజెన్ చెప్పారు. తమ కొడుకును జూన్ నెలలో చివరిసారిగా చూశానని విలేకరులకు తెలిపారు. అతను శనివారం నాడు మృతి చెందినట్లు గుర్తించామన్నారు. గతంలో టర్కీ, సిరియా మీదుగా ఇరాక్ వెళుతుండగా అతన్ని నిలువరించేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని దలాయిన్ చెప్పారు.