: రామ్ చరణ్ 'స్మార్ట్' రికార్డు!


తన పేరు మీద ప్రత్యేక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ రూపొందించిన తొలి దక్షిణాది హీరోగా రామ్ చరణ్ రికార్డు సృష్టించాడు. ఈ యాప్ గురించి అభిమానులకు తెలుపుతూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ వినోదాత్మక వీడియోనూ ఆయన పోస్ట్ చేశాడు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చని, తన సినిమాలకు సంబంధించిన వార్తలు, ప్రచార చిత్రాలు, స్పెషల్ స్టిల్స్, పాటలు, ట్రయిలర్స్ దీని ద్వారా చూడవచ్చని, ఈ యాప్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామని తెలిపాడు. తన సొంత నిర్మణ సంస్థ కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై యాప్ ను తయారు చేసినట్టు వివరించాడు.

  • Loading...

More Telugu News