: ఒక్క రోజులో రూ. 660 పెరిగిన బంగారం ధర... ఎందుకంటే!


నిన్నటి బులియన్ సెషన్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ. 660 పెరిగి మరోసారి రూ. 27 వేల స్థాయికి దగ్గరైంది. వరుసగా ఐదు రోజుల పాటు ధరలు తగ్గడం, ఆపై అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక్కరోజులో 2.1 శాతం పెరగడం, అదే సమయంలో డాలర్ తో రూపాయి మారకం విలువ నష్టపోవడం వంటి కారణాలతో ధర పెరిగిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ట్రేడర్లు, ఆభరణాల స్టాకిస్టుల నుంచి కొనుగోలు మద్దతేమీ పెరగలేదని ముంబై బులియన్ వ్యాపారులు తెలిపారు. ఈ కారణాలతోనే వెండి ధర కిలోకు రూ. 1200 పెరిగి రూ. 35,800కు చేరిందని అన్నారు. కాగా, నిన్నటి సెషన్లో 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ. 26,810కి, ఆభరణాల బంగారం ధర రూ. 26,660కి చేరిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఐదు సెషన్లలో ధర రూ. 1,100 రూపాయలు తగ్గింది.

  • Loading...

More Telugu News