: కన్నడ, తెలుగు రైతుల బాహాబాహీ!
సువర్ణముఖి నదిపై ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన ఆనకట్ట వద్ద ఈ ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నది నీరు తమ రాష్ట్ర అవసరాలకు మాత్రమే ఉపయోగపడాలంటూ కర్ణాటక రైతులు ఆనకట్టను కూల్చివేసేందుకు యత్నించడంతో, దాన్ని తెలుగు రైతులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా అగలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆనకట్ట తొలగించాలని కర్ణాటక రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో ఒకదశలో తెలుగు, కన్నడ రైతుల మధ్య తీవ్వ వాగ్వాదం, బాహాబాహీ జరిగింది. ఆనకట్ట తొలగింపును ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ఏపీ రైతులు హెచ్చరించారు. సమయానికి స్పందించిన కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లా ఎస్పీ కార్తీక్ రెడ్డి, ఏపీ పోలీసుల సహకారంతో ఆనకట్ట దగ్గర పహారా ఏర్పాటు చేసి రైతులను చెదరగొట్టారు.