: పెద్దిరెడ్డి అలక!... ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు
తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఈ ఉదయం జరిగిన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు. గత కొంతకాలంగా తెలంగాణలో పార్టీ సభ్యత్వ బాధ్యతలను భుజాన వేసుకుని పనిచేసిన పెద్దిరెడ్డి, కేంద్ర కమిటీలో పదవిని ఆశించగా, ఆయనకు తెలంగాణ కమిటీలో మాత్రమే స్థానం లభించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అసంతృప్తికి గురై ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.