: అదనపు ఆదాయంపై కన్నేసిన జైళ్ల శాఖ... తెలంగాణ జైళ్లలో మసాజ్ పార్లర్లు


ఒకవైపు ఖైదీలకు ఉపాధి, మరోవైపు జైళ్ల శాఖకు ఆదాయం, రెండింటి మధ్యా ప్రజలకు తక్కువ ధరలకు సేవలు... ఇదే తెలంగాణ జైళ్ల శాఖ సరికొత్త ఆలోచన. ఎంపిక చేసిన ఖైదీలకు మసాజ్ సెంటర్, స్పా నిర్వహణల్లో శిక్షణ ఇప్పించిన చర్లపల్లి, చంచల్ గూడ జైలు అధికారులు నేచర్ క్యూర్, మసాజ్ సేవలను అందుబాటులోకి తేనున్నారు. దసరా తరువాత ఈ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ప్రజలు జైలు వద్దకు వెళ్లి, మార్కెట్ ధరలతో పోలిస్తే తక్కువ ధరలకే మసాజ్ సేవలను పొందవచ్చు. తమ ఆలోచనలకు మంచి స్పందన వస్తోందని, స్వయంగా నిధులను సమకూర్చుకోవడమే కాకుండా, త్వరలోనే మిగులును సైతం చూపుతామని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ నమ్మకంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News