: నేడో, రేపో ఇండియా మా దారికి రావాల్సిందే!: పాక్


ఇరు దేశాల మధ్యా నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునే దిశగా 'ఆచరణాత్మక మరియు సహేతుకమైన' చర్చల దిశగా నేడో, రేపో ఇండియా తమ దారికి రావాల్సిందేనని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ భూభాగంపై ఇండియా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని, దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆయన హెచ్చరించారు. తమతో ఇండియా నిత్యమూ పరోక్ష యుద్ధం చేస్తున్నదని వ్యాఖ్యానించిన ఆయన ఇది ఎంతమాత్రమూ మంచిది కాదని అన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొన్న అనంతరం పాక్ తిరిగి వెళుతూ, లండన్ లో ఆగిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాము చర్చలకు రావాలని పిలుపునిస్తున్నా, ఇండియా స్పందించడం లేదని ఆరోపించిన ఆయన, ఇరు దేశాల మధ్య శాంతి కోసం నాలుగు సూత్రాలను తాము ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. సియాచిన్ లో మోహరించిన భారత బలగాలను వెనక్కు తీసుకోవాలని నవాజ్ షరీఫ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News