: మరో వివాదంలో బీజేపీ... గోమూత్రం చిలకరించుకుంటేనే నవరాత్రి ఉత్సవాలకు అనుమతట!


గుజరాత్ లో అధికార బీజేపీ మరో వివాదంలో పడింది. దసరా ఉత్సవాల సందర్భంగా జరిగే నవరాత్రి వేడుకల్లో ముస్లింలను ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించేది లేదని, ఇందులో పాల్గొనే హిందువులు తమ శరీరంపై గోమూత్రాన్ని చిలకరించుకోవాలని 'హిందూ సంఘటన్ యువ మోర్చా' ప్రకటించింది. దసరాలో భాగంగా వైభవంగా జరిగే 'గార్బా' కార్యక్రమాల్లో ముస్లింలను నిషేధిస్తున్నట్టు తెలిపింది. విశ్వహిందూ పరిషత్ తో సన్నిహిత సంబంధాలున్న ఈ కాషాయ కమిటీ, గార్బా ఈవెంట్లలో పాల్గొనే వారు తప్పనిసరిగా తిలకం ధరించాలని, తమ కార్యకర్తలు అన్ని చోట్లా జరిగే నవరాత్రి ఉత్సవాలపై నిఘాను పెట్టారని హిందూ సంఘటన్ యువ మోర్చా అధ్యక్షుడు రఘువీర్ సింగ్ జడేజా తెలిపారు. దీనిపై కొన్ని హిందూ సంఘాలతో పాటు ముస్లింలు కూడా మండిపడుతున్నారు. త్వరలో తాము సమావేశమై దీనిపై చర్చించనున్నట్టు స్థానిక ముస్లిం నేత అజామ్ ప్రకటించగా, "చాలా మంది హిందువులు రంజాన్ సందర్భంగా ఉపవాసాలు ఉంటారు. వినాయక చవితి ఉత్సవాల్లో ఎందరో ముస్లింలు పాల్గొంటారు. ఇప్పుడీ మతాల ప్రాతిపదిక ఏంటి?" అని ఓ బీజేపీ నేత ప్రశ్నించారు. కాగా, "పార్వతీ మాతను ప్రార్థిస్తూ జరిపే నవరాత్రి ఉత్సవాల్లో గోమాంసం తినే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశం లేదు" అని వీహెచ్పీ నేత ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News