: కోమాలో ఇంద్రాణి... విష ప్రయోగమన్న అనుమానాలపై విచారణ!


సొంత కుమార్తెను హత్య చేసిన ఆరోపణలపై కేసును ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జియాపై విషప్రయోగం జరిగిందా? ఈ దిశగా విచారణ జరపాలని అధికారులు నిర్ణయించారు. తాను వేసుకోవాల్సిన మందులను అధిక మోతాదులో వేసుకోవడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని తొలుత భావించినప్పటికీ, ఇప్పుడు మరేవైనా కారణాలున్నాయా? అన్న కోణంలో అధికారులు దర్యాఫ్తు ప్రారంభించారని తెలుస్తోంది. జైలు అధికారుల అలసత్వం ఇందులో కనిపిస్తోందని అధికారులు వ్యాఖ్యానించారు. కాగా, ఆమె కోమాలోకి జారుకుందని, స్వయంగా ఊపిరి పీల్చుకోలేకపోతున్న ఆమెకు కృత్రిమ శ్వాసను అందిస్తున్నామని జేజే ఆసుపత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే వెల్లడించారు. ఆమె బీపీ నార్మల్ గానే ఉందని తెలిపారు. ఆమె ఎప్పుడు కోమా నుంచి బయటకు వస్తుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని, ఆమె ప్రాణాలకు అపాయం తప్పిందని కూడా అనలేమని వివరించారు.

  • Loading...

More Telugu News