: మార్క్ జుకర్ బర్గ్ పై 'మోసం' కేసు నమోదు


ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ను ఓ బిల్డర్ కోర్టుకు ఈడ్చాడు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ నివాసి, బిల్డర్ మిర్సియా ఓస్పెర్సియన్‌ అనే వ్యక్తి శాన్‌ జోస్‌ లోని కోర్టులో కేసు వేస్తూ, జుకర్‌ బర్గ్‌ తనను మోసం చేశారని ఆరోపించాడు. 2012లో ఆయన తనకిచ్చిన మాట నిలుపుకోలేదని కోర్టుకు తెలిపాడు. తన బెడ్‌రూమ్‌ ఎదురుగా ఉన్న స్థలంలో ఇల్లు నిర్మించాలని భావించానని, దాన్ని అడ్డుకున్న మార్క్, ఇంటిని నిర్మించకుండా ఉంటే, సిలికాన్‌ పెద్దలను పరిచయం చేసి, వ్యాపారం పెంచుతానని హామీ ఇచ్చారని, ఆపై మాట తప్పారని కోర్టుకు ఫిర్యాదు చేశాడు. నోటీసులు అందుకున్న జుకర్‌ బర్గ్‌ తనకే పాపం తెలియదని చెప్పగా, ఓస్పెర్సియన్‌ మాత్రం తన ఆరోపణలకు సాక్షాలుగా, అప్పట్లో మార్క్ పంపిన ఇ-మెయిల్స్ ఉన్నాయని వివరించాడు. దీంతో న్యాయమూర్తి కేసును విచారణకు స్వీకరించి వాయిదా వేశారు. ఫేస్‌ బుక్‌ సీఈఓగా, ప్రపంచంలో అత్యంత ప్రముఖుల్లో ఒకరిగా ఉన్న జుకర్‌ బర్గ్‌ పై మోసం ఆరోపణలు రావడంతో ఈ కేసును టెక్ వర్గాలు అత్యంత ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి.

  • Loading...

More Telugu News