: బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఎన్నిక లాంఛనమే!
బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఎన్నిక రేపు లాంఛనంగా జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడి రేసులో నిలిచేందుకు శశాంక్ మనోహర్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. రేపు జరిగే సాధారణ సమావేశంలో ఆయన బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈస్ట్ జోన్ కు చెందిన జగ్ మోహన్ దాల్మియా ఆకస్మిక మరణంతో బీసీసీఐ అధ్యక్ష పదవి ఖాళీ అయింది. దీంతో ఎన్నిక అనివార్యమైంది. వాస్తవానికి జగ్ మోహన్ దాల్మియా ప్రాతినిధ్యం వహించిన ఈస్ట్ జోన్ కు చెందిన వ్యక్తి బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టాల్సి ఉన్నప్పటికీ, ఈస్ట్ జోన్ లోని ఆరు క్రికెట్ సంఘాలు శశాంక్ మనోహర్ కు మద్దతు తెలిపాయి.