: చెన్నైలో అట్టహాసంగా ప్రారంభమైన ఐఎస్ఎల్
చెన్నైలో ఇండియన్ సాకర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు నెలలపాటు సాగనున్న రెండో సీజన్ ప్రారంభ వేడుకలకు అతిరథమహారధులు హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సౌత్ ఇండియా సినీ దిగ్గజం రజనీకాంత్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, అలియా భట్, అర్జున్ కపూర్, ఐఎస్ఎల్ జట్లు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అలియా భట్, ఐశ్వర్యరాయ్ డాన్స్ చేసి అలరించగా, అర్జున్ కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.