: టీట్వంటీల్లో ధోనీ అరుదైన రికార్డ్
అంతర్జాతీయ కెరీర్ లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. 50 అంతర్జాతీయ టీట్వంటీ మ్యాచ్ లకు నేతృత్వం వహించిన కెప్టెన్ గా నిలిచాడు. ఇందులో 26 టీట్వంటీల్లో జట్టును విజయపథాన నడపగా, 22 మ్యాచుల్లో టీమిండియా ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ ను టైగా ముగించగా, మరో మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ధర్మశాలలో సౌతాఫ్రికాతో ఆడిన మ్యాచ్ తో ధోనీ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక టీట్వంటీలకు కెప్టెన్సీ చేపట్టిన వ్యక్తిగా ధోనీ నిలిచాడు. కాగా, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దీనికి కూడా ధోనీ కెప్టెన్సీ చేస్తే కెరీర్ లో మరిన్ని మైలు రాళ్లు అధిగమించే అవకాశం ఉంది.