: నెల్లూరులో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు తండ్రి విగ్రహావిష్కరణ
నెల్లూరు నగరంలో ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తండ్రి సాంబమూర్తి విగ్రహావిష్కరణ జరిగింది. బాలు తల్లి శకుంతలమ్మ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు నెల్లూరులో 15వేల మంది విద్యార్థులతో స్వచ్ఛభారత్ ర్యాలీ నిర్వహించారు. వీఆర్ సీ మైదానం నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు ఈ ర్యాలీ జరిగింది.