: హిందువుల్లో బీఫ్ తినేవారు లేరా?: లాలూ
బీఫ్ తిన్నాడన్న కారణంతో ఒక వ్యక్తిని కొట్టి చంపడం అత్యంత దారుణం అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. యూపీలోని దాద్రిలో జరిగిన ఈ ఘటన ముమ్మాటికీ మత హింసే అని అన్నారు. ఈ అంశంతో బీజేపీ సరికొత్త వివాదానికి తెరలేపిందని చెప్పారు. ఎవరికి ఇష్టమున్న ఆహారాన్ని వారు తింటారని ఆయన అన్నారు. హిందువుల్లో బీఫ్ తినేవారు లేరా? అని ప్రశ్నించారు. విదేశాలకు వెళ్లే హిందువులు అక్కడ బీఫ్ తింటున్నారని తెలిపారు. అంతెందుకు, మన దేశంలో ఉన్న హిందువులు కూడా కొంత మంది బీఫ్ తింటున్నారని చెప్పారు. ఆవు మాంసం తిన్నాడనే ఆరోపణలతో మహమ్మద్ అనే వ్యక్తిని కొంత మంది వ్యక్తులు కొట్టి చంపిన సంగతి తెలిసిందే.