: ఎన్నికల ప్రచారం నిర్వహించిన సోనియాగాంధీ
బీహార్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నేడు ప్రచారం నిర్వహించారు. బాగల్ పూర్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పాలనపై ఆమె ధ్వజమెత్తారు. ప్యాకేజీల పేరిట ప్రజలను మోసగించడంలో మోదీ సిద్ధహస్తుడని విమర్శించారు. తప్పుడు ప్రమాణాలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. దేశ ప్రజలు శాంతి భద్రతలతో బతకాలనుకుంటున్నారో లేక భ్రమల్లో బతకాలనుకుంటున్నారో బీహార్ ఎన్నికల్లో తేలిపోతుందని సోనియా చెప్పారు. దేశానికి ఏమి కావాలో ఈ ఎన్నికలు స్పష్టం చేస్తాయని తెలిపారు.