: తెలుగువారికి అన్యాయం జరగకూడదు: వెంకయ్యనాయుడు
ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందిన సాయం ఏ రాష్ట్రానికి అందలేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అంతకంటే మెరుగైన సాయం కోసం ఆలోచిస్తున్నామని చెప్పారు. తెలుగువారికి మేలు చేయాలని కంకణం కట్టుకున్నానని, తెలుగువారికి అన్యాయం జరగకూడదని పేర్కొన్నారు. ఇదే సమయంలో తెలంగాణకు కూడా మేలు చేస్తామని చెప్పారు. రాష్ట్రాల అవసరాలను కేంద్రం తప్పకుండా గుర్తిస్తుందని పేర్కొన్నారు. తమిళనాడులో తెలుగుబాష బోధనపై స్పందించిన వెంకయ్య, తప్పకుండా తెలుగుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో వెంకయ్య, సినీ నటుడు కమల్ హాసన్ పర్యటించారు. స్వర్ణభారతి ట్రస్టులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని సురక్ష బీమా యోజన పథకం పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.