: రాజధాని శంకుస్థాపనకు కమిటీలను నియమించిన చంద్రబాబు


మరికొన్ని రోజుల్లో జరగనున్న ఏపీ రాజధాని శంకుస్థాపనకు ఇవాళ కమిటీల నియామకం జరిగింది. ఈ మేరకు విజయవాడలో సీఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రి నారాయణ, సీఆర్ డీఏ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. శంకుస్థాపనకు మొత్తం నాలుగు కమిటీలను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. మంత్రి నారాయణ నేతృత్వంలో ఆర్గనైజింగ్ కమిటీ, ప్రొటోకాల్ డైరెక్టర్ నేతృత్వంలో రిసెప్షన్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వేదిక కమిటీ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ నేతృత్వంలో సాంస్కృతిక, మీడియా కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News