: ప్రధానిపై శివసేన తీవ్ర వ్యాఖ్యలు


ప్రధాని నరేంద్ర మోదీపై శివసేన మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీహార్ కు భారీ ప్యాకేజ్ ఇచ్చిన ప్రధాని కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నారని మండిపడింది. మహారాష్ట్ర నుంచి సర్ ఛార్జ్ రూపంలో వసూలు చేసిన రూ. 1600 కోట్లను కేంద్రం బీహార్ కు పంచుతోందని విమర్శించింది. మహారాష్ట్ర, విదర్భ, మరట్వాడా ప్రాంతాల్లో వందలాది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని... అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీహార్ కు ఇస్తున్నట్టుగా మహారాష్ట్రకు లక్షా పాతిక వేల కోట్ల ప్యాకేజీ అవసరం లేదని... 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుందని సూచించింది. తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో మోదీపై ఈ విధంగా విరుచుకుపడింది.

  • Loading...

More Telugu News