: మోదీని అనుకరిస్తూ లాలు డబ్ స్మాష్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తన వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలతో ప్రత్యర్థులను చీల్చి చెండాడుతున్నారు. ఓసారి మీడియా ద్వారా, మరోసారి ట్విట్టర్ లో... ఎక్కడ వీలుంటే అక్కడ మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇప్పుడాయన సోషల్ మీడియాలో అత్యంత పాప్యులర్ అయిన డబ్ స్మాష్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని అనుకరించారు. ఎన్నికల ముందు మోదీ ఇచ్చిన హామీల్ని ఇప్పుడు పూర్తిగా మరచారంటూ ఆ వీడియోకి కామెంట్ జత చేసి ట్విట్టర్, యూ ట్యూబ్ లలో పోస్టు చేశారు. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కూడా లాలూ డబ్ స్మాష్ చేశారు. ప్రస్తుతం ఈ డబ్ స్మాష్ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది.