: చంద్రబాబుకు గుడి కడుతున్న రాజధాని రైతులు


మన దేశంలో దేవుళ్లకే కాదు, సినీ రాజకీయ నాయకులకు కూడా వారి వారి అభిమానులు గుళ్లు కడుతుంటారు. ఆ మధ్య గుజరాత్ లో ఓ వీరాభిమాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గుడి కట్టడం చూశాం. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా ఓ గుడి కడుతున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో చంద్రబాబుకు గుడికట్టాలని రాజధాని రైతులు నిర్ణయించారు. దానికి సంబంధించి ఈ నెల 22న శంకుస్థాపన చేయాలని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ మంత్రులందరూ వస్తారని తెలుస్తోంది. తమ గ్రామాన్ని రాజధానిగా చేసిన చంద్రబాబును దేవుడిలా భావిస్తున్నామని ఆ గ్రామ రైతులు తెలిపారు. ఇందుకు బాబుకు జీవితకాలం రుణపడి ఉంటామంటున్నారు. అందుకే ఆయనకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నామని రైతులు తెలిపారు.

  • Loading...

More Telugu News