: పాలమూరు ఎత్తిపోతల పథకం రెండేళ్లలో పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశం


పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం తక్షణమే పనులు ప్రారంభించాలని చెప్పారు. ఈ పథకంపై సీఎం ఇవాళ సమీక్ష నిర్వహించారు. పంప్ హౌస్ లు, కాల్వలు, రిజర్వాయర్లు, టన్నెల్స్ పనులు సమాంతరంగా జరగాలన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్, హేమసముద్రం రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. రెండు వారాల్లో సర్వే పనులు పూర్తి చేసి టెండర్లు పిలవాలని, ప్రాజెక్టులపై ప్రతి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష జరపాలని పేర్కొన్నారు. పాలమూరు పథకం కోసం భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకే తొలి ప్రాధాన్యత ఉంటుందని కేసీఆర్ చెప్పారు.

  • Loading...

More Telugu News