: అద్దంలో నా ముఖాన్ని నేనే చూసుకోలేకపోతున్నా... ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా: జెనీలియా
తన అందం పాడైపోయిందని ప్రముఖ సినీ నటి జెనీలియా తెగ బాధపడిపోతోంది. బాలీవుడ్ హీరో రితీష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు ఇటీవలే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత తన శరీర చాయ నల్లబడిపోయిందని జెనీలియా అంటోంది. ముఖమంతా ప్యాచ్ ప్యాచ్ గా మారిపోయిందట. తన ముఖాన్ని అద్దంలో తానే చూసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు, వయసుకు మించి కనిపిస్తున్నానని అంది. దీంతో, మళ్లీ అందంగా, యవ్వనంగా కనిపించడానికి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని వెల్లడించింది. జెనీలియా మళ్లీ నటించడానికి సిద్ధమవుతోందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.