: ఏపీ ఆబ్కారీ శాఖలో అంతర్గత కుమ్ములాటలు... కమిషనర్, డైరెక్టర్లపై బదిలీ వేటు
ఏపీ ఎక్సైజ్ శాఖలో మరో వివాదం చెలరేగింది. ఇప్పటికే ఈ శాఖలోని ఓ అధికారి మొత్తం ఆ శాఖనే తన గుప్పిట్లో పెట్టుకుని నవ్రాంధ్ర రాజధాని సమీపంలోని విజయవాడలో రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పి ఉద్యోగుల వద్ద నుంచి భారీ ఎత్తున వసూళ్లు చేశారు. దీనిపై పత్రికల్లో వరుస కథనాలు రావడంతో సీఎం నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను దారిలో పెట్టాలని ఆయన ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఆ శాఖలో అధికారుల మధ్య అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇక లాభం లేదని భావించిన చంద్రబాబు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఆ శాఖ కమిషనర్ శ్రీనివాస్ శ్రీనరేశ్ తో పాటు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న దామోదర్ లను ఆ పోస్టుల్లో నుంచి తప్పించారు. వారిద్దరికీ పోస్టింగ్ లు ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టారు. ఈ రెండు పోస్టుల బాధ్యతను సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లంకు అప్పగిస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.