: నిజామాబాద్ కలెక్టర్ పై టీఆర్ఎస్ నేతల మూకుమ్మడి దండయాత్ర


నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణా అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొన్నారు. నేటి ఉదయం నిజామాబాదులో జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్ కు చెందిన జడ్పీ చైర్మన్ సహా, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ఆమెపై విరుచుకుపడ్డారు. ప్రొటోకాల్ పాటించడం లేదని జడ్పీ చైర్మన్ నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల వినియోగంపై థర్డ్ పార్టీతో విచారణ చేయించడంపై ఎమ్మెల్యేలు కలెక్టర్ పై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకే థర్డ్ పార్టీ చేత విచారణ చేయిస్తున్నామని కలెక్టర్ వివరణ ఇచ్చే యత్నం చేశారు.

  • Loading...

More Telugu News