: ఈ నెల 5, 6 తేదీల్లో గవర్నర్ ఢిల్లీ పర్యటన
ఈ నెలలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హస్తిన పర్యటన ఖరారైంది. ఈ నెల 5, 6 తేదీల్లో ఆయన ఢిల్లీ వెళుతున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లను గవర్నర్ కలుస్తారని తెలిసింది. ఏపీ, తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, ఇతర విషయాలపై ప్రధానంగా వివరించనున్నారు. అయితే గవర్నర్ ఢిల్లీ పర్యటన సాధారణమేనని, ప్రాధాన్యమేమీ లేదని రాజభవన్ వర్గాలు పేర్కొన్నాయి.